- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T BJP: తెలంగాణలో మరో ఉప ఎన్నిక!.. బీజేపీ హైకమాండ్ ఖతర్నాక్ ప్లాన్?
తెలంగాణలో రాజకీయాల్లో బీజేపీ అధిష్టానం అధిరిపోయే ప్లాన్ చేస్తోందా?

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీలో (Telangana BJP) పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడి నియామకం విషయం ఆ పార్టీని కుదుపునకు గురి చేసింది. రామచందర్ రావును స్టేట్ ప్రెసిడెంట్ గా నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. అనంతరం పార్టీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే రాజాసింగ్ వ్యవహారం పట్ల బీజేపీ అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా గత కొంత కాలంగా పార్టీకి నష్టం కలిగించేలా కామెంట్స్ చేస్తున్న రాజాసింగ్ పై సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో రాజాసింగ్ పై అనర్హత వేటు వేసేందుకు సిద్ధం అయినట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే త్వరలో తెలంగాణలో మరో ఉప ఎన్నిక (By Election) అనివార్యం కానుంది.
ఒక్క దెబ్బతో రెండు పిట్టలు:
తెలంగాణ బీజేపీలో గత కొంత కాలంగా నేతల మధ్య అధిపత్య పోరు సాగుతోందనే చర్చ వినిపిస్తోంది. ఈ కోల్డ్ వార్ కారణంగానే అధ్యక్షుడి ఎంపిక విషయంలో తాత్సారం జరిగిందనే వాదన ఉంది. ఇక చివరకు అధిష్టానమే అన్ని అంచనాలతో ఓ నిర్ణయానికి వచ్చి రామచందర్ రావు పేరును ప్రతిపాదిస్తూ నిర్ణయం తీసుకున్నదని అయితే ఈ నిర్ణయం పట్ల మిగతా నేతలు మౌనంగా అంగీకరించినా రాజాసింగ్ మాత్రం బరస్ట్ కావడంతో ఈ అంశాన్ని జాతీయ నాయకత్వం సీరియ్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ పత్రం ఇచ్చినా అతను నామినేషన్ దాఖలు చేయకుండా పార్టీ ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆయన హైకమండ్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో రాజాసింగ్ (Raja Singh) ను బుజ్జగించే ప్రయత్నాలు సైతం జరపకూడదనే నిర్ణయానికి వచ్చిందని తన రాజీనామా లేఖలోనే స్పీకర్ కు రాజీనామా లేఖ పంపాలని రాజాసింగ్ కోరడంతో అతని రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కు పంపించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక ద్వారా రాజాసింగ్ ను ఎదుర్కోవడంతో పాటు పార్టీపై ఎదురు తిరిగితే ఇలాంటి సీరియస్ యాక్షన్ తప్పదనే సంకేతాలు పార్టీ నేతలకు ఇచ్చినట్లుగా ఉంటుందనే వ్యూహంతో కమలం పార్టీ అధినాయకత్వం ముందుకు వెళ్లాలనే నిర్ణయంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
రాజాసింగ్ వ్యూహమేంటి?:
బీజేపీ పార్టీ తన విషయంలో సీరియస్ యాక్షన్ లోకి దిగితే రాజాసింగ్ పరిస్థితి ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఏదైనా పార్టీలో చేరుతారా లేక సొంత ఎజెండాతో ముందుకు సాగుతారా అనేది తేలాల్సి ఉంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఆయన బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress), జనసేన, శివసేన (ఉద్దవ్, షిండే రెండు వర్గాలు) వంటి పార్టీల వైపు చూస్తున్నట్లు ఉహాగానాలు వినిపిస్తున్నాయి. తన విషయంలో అధిష్టానం స్ట్రాంగ్ యాక్షన్ లోకి దిగి ఉప ఎన్నికల వరకు పరిస్థితి వస్తే రాజాసింగ్ వ్యూహం ఏంటి అనేది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఇన్నాళ్లు తన పార్టీ అనుకున్న బీజేపీని ఉప ఎన్నికల్లో ఎదుర్కొంటారా లేక కార్యకర్తల అభిప్రాయాలను వ్యక్తం చేస్తే తనపై చర్యలు తీసుకున్నారని ఆరోపణలు చేస్తూ రాజకీయాల నుంచే తప్పుకుంటా అనేది కాలమే సమాధానం చెప్పనుంది. అయితే ఇప్పటికే జూబ్లీహిల్స్ స్థానానికి బై పోల్ నిర్వహించాల్సి ఉండగా రాజాసింగ్ ఎపిసోడ్ లోనూ బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయం మరింత రంజుగా మారే అవకాశం ఉంటుంది.






