- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ ‘OG’ సినిమాకు మరో BIG షాక్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన ఓజీ చిత్రానికి(OG Movie) మరో అనూహ్య షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన ఓజీ చిత్రానికి(OG Movie) మరో అనూహ్య షాక్ తగిలింది. బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల ధర పెంపుపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో విచారణ జరిగింది. రివ్యూ పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. హైకోర్ట్ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 9 వరకు ఇవే ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. టికెట్ రేట్లు ఎందుకు పెంచాలనుకున్నారో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 9కి వాయిదా వేసింది. మరోవైపు ఓజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.154కోట్లకుపైగా వసూలు చేసిందని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు పవర్‌ఫుల్ పోస్టర్ పంచుకుంటూ ‘ఇది పవన్ కల్యాణ్ సినిమా. చరిత్రను ఓజీ చెరిపేసింది’ అని క్యాప్షన్ పెట్టింది. ప్రీమియర్స్‌లోనూ అత్యధిక వసూళ్లు (గ్రాస్) రాబట్టిన సినిమాగా ‘ఓజీ’ నిలిచింది. ఫస్ట్ డే అత్యధిక వసూలు చేసిన టాప్-10 భారతీయ సినిమాల జాబితాలో ‘ఓజీ’ చోటు దక్కించుకుంది.






