కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. పార్టీకి మరో కీలక నేత గుడ్ బై

by Disha Web Desk 13 |
కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. పార్టీకి  మరో కీలక నేత గుడ్ బై
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఎంపీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ లో నేతల వలసలు టెన్షన్ పెట్టిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తామని మహారాష్ట్రలో అడుగు పెట్టిన గులాబీ బాస్ కేసీఆర్ కు తాజాగా మరో బిగ్ షాక్ తగిలింది. మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాణిక్ రావు గతం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) లో చేరిపోయారు. పార్టీలో చేరిన వెంటనే మాణిక్ రావు కదమ్ కు అజిత్ పావర్ కీలక పోస్ట్ ఇచ్చారు. ఎన్సీపీ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా నియమించారు. మాణిక్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు సైతం ఎన్సీపీ గూటికి చేరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత నెలల తరబడి అధినాయకత్వం సైలెంట్ గా ఉండటం, కేంద్ర నాయకత్వం నుంచి ఎలాంటి దిశానిర్దేశనం లేకపోవడంతో తాము తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

కాగా లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా ? లేదా? అనే విషయంలో వారం రోజుల్లో స్పష్టత ఇవ్వాలని కేసీఆర్ కు ఇటీవల ఆ పార్టీ మేతలు లేఖ రాశారు. అయినా కేసఆర్ వారి లేఖకు రియాక్ట్ కాలేదని, కేసీఆర్ వైఖరితో రాబోయే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో తెలియక అక్కడి నేతలు సతమతమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇక చేసేదేమి లేక పార్టీని వీడి ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పరిస్థితి పై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఆసక్తిగా మారింది.


Next Story