- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KCR: తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ మరో బిగ్ ప్లాన్!.. అప్పటి వరకు సైలెంట్ మోడ్ లోనే!
మరో ఏడాది పాటు ప్రజాక్షేత్రానికి కేసీఆర్ దూరంగానే ఉండబోతున్నారనే చర్చ సామాజిక మాధ్యమాల్లో జోరుగా జరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి (KCR into public domain) ఎప్పుడు వస్తారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలోనూ ఆయన ప్రచారానికి వస్తారని ఊహాగానాలు వినిపించినా అలాంటిదేమి జరగలేదు. ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం అధినేత ప్రజాక్షేత్రంలోకి వస్తారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఒకటి ఆసక్తిగా మారింది.
అప్పటి వరకు నో:
ప్రజాక్షేత్రానికి దూరంగా ఉన్నప్పటికీ పార్టీ నాయకులకు కేసీఆర్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై అనుసరించాల్సిన వ్యూహాలను కేటీఆర్, హరీశ్ రావులకు సలహాలు ఇస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే కేసీఆర్ ప్రత్యక్షంగా లేని లోటును పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్నాయని దాంతో ఆయన ఒక్కసారైనా ప్రజల్లోకి రావాలనే అభిప్రాయాలు సొంతపార్టీలోనే వ్యక్తం అవుతున్నాయి. కానీ కేసీఆర్ మాత్రం వచ్చే ఏడాది కూడా ప్రజల్లోకి వచ్చే అవకాశం లేదని సోషల్ మీడియాలో ప్రచారం గుప్పుమంటోంది. 2027 ఏప్రిల్ తర్వాతే ఆయన ప్రజల్లోకి రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక అదే సమయంలో కేటీఆర్ సైతం పాదయాత్ర (KTR Padayatra) నిర్వహిస్తారని రాష్ట్ర రాజకీయాల్లో ఈ టైమ్ ప్రేమ్ పాదయాత్రలకు అత్యంత అనుకూలం అని అని అందువల్లే బీఆర్ఎస్ నాయకత్వం ఈ రకంగా సెట్ చేస్తోందనే టాక్ వినిపిస్తోంది. పార్టీ పునర్నిర్మాణం, పునర్ వ్యవస్థీకరణ అంతా 2027 ఏప్రిల్ కంటే ఆరు నెలల ముందు 2026 చివర్లోనే మొదలవుతాయనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం 2028లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో 2026 అక్టోబర్ నుంచి బీఆర్ఎస్ తన ఎన్నికల ప్రిపరేషన్స్ ను స్పీడప్ చేసి 2027లో పూర్తిస్థాయిలో ప్రజల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై కార్యక్రమాలు నిర్వహించుకునేలా కేసీఆర్ ప్రక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారనే చర్చ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
డ్యామేజ్ ఎవరికి? అడ్వాంటేజ్ ఎవరికి?:
కేసీఆర్ ప్రజాక్షేత్రానికి దూరంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి అదనపు అడ్వంటేజ్ అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అధికారం ఉంటేనే కేసీఆర్ ప్రజల గురించి ఆలోచిస్తారని లేదంటే ప్రజల సమస్యలను కూడా పట్టించుకోరనే నెరెటివ్ ను ఇప్పటికే అధికార కాంగ్రెస్ క్రియేట్ చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు జోష్ లో ఉన్న హస్తం పార్టీ అదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలకు సై అంటోంది. ఈ ఎలక్షన్స్ లో సత్తా చాటితే ఇక రాష్ట్ర రాజకీయాల్లో తమకు తిరిగుండదనేది రేవంత్ రెడ్డి (Revanth Reddy) అంచనాతో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం మరో ఏడాది కాలం కేసీఆర్ పూర్తిగా ప్రజా క్షేత్రానికి దూరంగా ఉంటే అది గులాబీ పార్టీకి ఏ రకంగా డ్యామేజ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు అడ్వాంటేజ్ గా మారుతుంది అనేది కాలమే సమాధానం చెప్పనుంది.






