- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: తెలంగాణలో మరో ఎయిర్‍పోర్టు.. ప్రీ ఫీజిబిలిటీ స్టడీ కోసం రూ. 40.53 లక్షలు
తెలంగాణలో మరో ఎయిర్ పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని పెద్దపల్లి (Peddapalli) జిల్లా బసంత్ నగర్ లో నూతన విమానాశ్రయం (Basanthnagar Airport) విషయంలో ట్విస్ట్ నమోదైంది. ఇక్కడ విమానాశ్రయం నిర్మించడం వీలు కాదని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో ప్రత్యామ్నాయంగా పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో (Anthargam Airport) విమానాశ్రయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఇక్కడ ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల కోసం ప్రీ ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించబోతోంది. ఇందుకోసం ఎయిర్‍పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు రూ.4.53 లక్షల ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కోసం 591 ఎకరాలు కేటాయించింది. రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి ఈ విమానాశ్రయం మొదట బసంత్‍నగర్‍లో నిర్మించాలని భావించారు. అయితే అక్కడ భూభాగం, సాంకేతికంగా, ఆర్థికంగా అనుకూలం కాకపోవడంతో ప్రాజెక్టులో మార్పులు చేశారు.






