TG Govt:అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు.. టీచర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ!

by Jakkula.Mamatha |   (  Updated:2025-04-30 10:29:33  IST  )

తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు వచ్చేశాయి

TG Govt:అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు.. టీచర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ!
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు వచ్చేశాయి. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) రేపటి(మే 1) నుంచి అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాలకు(Anganwadi centers) మే 1వ తేదీ నుంచి జూన్ 1 తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ఇంటి వద్దకే పోషకాహారం సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఈ తరుణంలో అంగన్వాడీ చిన్నారులకు, గర్భిణులకు బాలింతలు టేక్ హోం రేషన్ ద్వారా గుడ్లు సరుకులు సరఫరా చేయనున్నారు. అయితే.. వేసవి సెలవుల సమయంలో అంగన్వాడీ టీచర్లకు ఇతర విధులు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటింటి సర్వే, హోం విసిట్స్, అంగన్వాడీలో చేర్చే చిన్నారుల గుర్తింపు వంటి విధులను నిర్వర్తించాలని అంగన్వాడీ టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు.

Next Story