జూన్ 2న పే స్కేల్ ప్రకటించండి: మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఉపాధి హామీ సిబ్బంది

by Kema Shiva Kumar |

జూన్ 2న పే స్కేల్ ప్రకటించండి: మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఉపాధి హామీ సిబ్బంది
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఎఫ్‌టీఈ సిబ్బంది తమ చిరకాల డిమాండ్ అయిన పే స్కేల్‌ను రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకటించాలని సాంకేతిక సహాయకుల సంఘం నేతలు మంత్రి సీతక్కను కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల ప్రతినిధులు తమ సమస్యలు, ఆకాంక్షలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు జూన్ 2న పే స్కేల్ ప్రకటించి వేలాది మంది ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఆశలు నింపాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉపాధి హామీ పథకంలో సేవలందిస్తున్న సాంకేతిక సహాయకులు తగిన గుర్తింపు, ఉద్యోగ భద్రత కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం అమలులో ఉన్న ఉపాధి హామీ పథకం త్వరలో మారబోతున్న నేపథ్యంలో, మహాత్మా గాంధీ పేరు మీద కొనసాగుతున్న పథకంలోని ఉద్యోగులకు ఈ మార్పునకు ముందే పే స్కేల్ ప్రకటిస్తే అది చారిత్రాత్మక నిర్ణయంగా నిలుస్తుందని వివరించారు.

Next Story