- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నపూర్ణ క్యాంటీన్లపై జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం
అన్నపూర్ణ క్యాంటీన్లపై జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్: అన్నపూర్ణ క్యాంటీన్లపై జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరా క్యాంటీన్లుగా పేరు మార్చేందుకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇందిరా క్యాంటీన్‌లో రూ.5 భోజనంతో పాటూ టిఫిన్స్ కూడా పెట్టాలని నిర్ణయించింది. అంతే కాకుండా ప్రస్తుతం అన్నపూర్ణ క్యాంటీన్లకు శాశ్వత నిర్మాణాలు లేకపోవడంతో శాశ్వత నిర్మాణాల పునరుద్దరణకు కమిటీ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 373 అన్నపూర్ణ క్యాంటీన్లు ఉన్నాయి. వీటిలో 53 కేంద్రాల్లో డబ్బాలు పాడవ్వడంతో మూతపడ్డాయి. ప్రస్తుతం 320 కొనసాగుతున్నాయి. వీటితో దాదాపు ప్రతిరోజూ 40వేల మందికి పైగా రూ.5 భోజనం చేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం భోజనం పెట్టగా క్యాంటీన్ పేరు మార్చి రూ.5కే ఇడ్లీ, వడ, ఉప్మా, టమాట బాత్ లాంటివి టిఫిన్స్ పెట్టాలని ఆలోచిస్తున్నారు.






