- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Free.. Free.. Free: కాంగ్రెస్ కొత్త ఆఫర్..! ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ అంటూ జూబ్లీహిల్స్‌లో వెలసిన బ్యానర్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలుపుపై ప్రధాన పార్టీలు తీవ్ర కసరత్తు ప్రారంభించాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలుపుపై ప్రధాన పార్టీలు తీవ్ర కసరత్తు ప్రారంభించాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. సిట్టింగ్ సీటు అయిన బీఆర్ఎస్ పార్టీకి సీటు చేజారి పోకుండా ఉండేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తోంది. మరోవైపు గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచిన తీరును ఇక్కడ కూడా కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్‌లో మాత్రం ఆశావాహుల తాకిడి ఎక్కువైంది. ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం లో ఫ్లెక్సీల కలకలం ఎక్కువైంది.
తాజాగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) పేరుతో పోస్టర్లు వెలిశాయి. ఓటర్లకు ఆఫర్ అనే తీరులో (Free.. Free.. Free) ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల బ్యానర్ వెలిసింది. నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్ ప్రజలకు దసరా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త ఆఫర్ ప్రకటించారు. DTH యూజర్స్, కేబుల్ టీవీ కస్టమర్లకు నో మంత్లీ బిల్ అంటూ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేరుతో కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాను జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నట్టు ఇప్పటికే అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించారు. అలాగే మంత్రి పదవి కూడా కావాలని బహిరంగ స్టేట్‌మెంట్ ఇచ్చారు. కాగా, ఈ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ పేరును పార్టీ దాదాపు ఖరారు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వెలిసిన పోస్టర్ల నేపథ్యంలో అంజన్‌కుమార్‌కు జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తారా? అని శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.






