- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో మంత్రి తలసాని ఒక్కడే యాదవుడా..? అంజన్ కుమార్ యాదవ్ ఫైర్
by Satheesh |
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలోని యాదవ సంఘాలు ఫైర్ అవుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలోని యాదవ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి 48 గంటల్లోగా బేషరతుగా మంత్రి శ్రీనివాస్ యాదవ్‌కు, రాష్ట్రంలోని యాదవ్‌లకు క్షమాపణ చెప్పాలని డెడ్ లైన్ విధించారు. ఇదిలా ఉండగా ఈ ఇష్యూపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ స్పందించారు. తెలంగాణలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక్కడే యాదవుడా అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అసలు మేం నిజమైన యాదవులమని అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడినాకే మా పార్టీ అధ్యక్షుడు మాట్లాడారని స్పష్టం చేశారు. యాదవ సంఘాలు గాంధీ భవన్ ముట్టడికి ఎలా వస్తాయో.. ఎవరో వస్తారో మేం చూస్తాం.. ఖబర్దార్ అని హెచ్చరించారు.
Next Story






