Congress: తమ్ముడినే చంపారు రేపు నన్నూ చంపుతారేమో.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాట్ వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-10-13 07:41:45  IST  )

ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక అంశంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Congress: తమ్ముడినే చంపారు రేపు నన్నూ చంపుతారేమో.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాట్ వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‍రెడ్డి (Jadcherla MLA Anirudh Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ (Errashekar) కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ఇందుకు అంతా సిద్ధం అయిందని జరుగుతున్న ప్రచారంపై అనిరుధ్ రెడ్డి స్పందించారు. ఇక్కడ ఇప్పటి వరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవన్నారు. సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని హత్య చేశారు. రేపు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చని హాట్ కామెంట్స్ చేశారు. ఇలాంటి వారి కోసం జెడ్ కేటగిరి సెక్యూరిటీ అడగాలా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు మేము ఓడిపోవాలని ప్రయత్నం చేసిన వారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరూ ఒప్పుకునే పరిస్థితి లేదన్నారు. వారికి గేటు వద్దకు వెళ్తే కనీసం అపాయింట్ మెంట్ కూడా దొరకదని కావాలనే ఇలాంటి లీకులు ఇస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ క్లారిటీతో ఉన్నారన్నారు. కాగా ఎర్ర శేఖర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‍ను వీడి బీఆర్ఎస్‍లో చేరారు.

Next Story