- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ, తెలంగాణకు చల్లని కబురు.. రాబోయే మూడు రోజులు వర్షాలు
ఎండలతో మండిపోతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రెండు రాష్ట్రాలలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్: ఎండలతో మండిపోతున్న తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రెండు రాష్ట్రాలలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ద్రోణి అంతరాయం నేడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మున్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నట్టు పేర్కొంది. దాని ఫలితంగా గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. అదే విధంగా శుక్ర, శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
దక్షిణ కోస్తాలో మూడు గురు,శుక్ర, శనివారాలు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం కూడా ఉందని తెలిపింది. రాయలసీమలో గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అంచనా వేసింది. శుక్ర, శనివారం తేలికపాటి నుండి మోస్తరువర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణలో బుధవారం ద్రోణి అస్థిరత ఇప్పడు దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మున్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మి ఎత్తులో విస్తరించి ఉంది. రాష్ట్రంలో గురు, శుక్ర, శనివారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఇదే స్థౄయిలో ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది. కొన్ని జిల్లాల్లో ఒక్కడక్కడా ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.






