అందెశ్రీ అంతిమయాత్ర ప్రారంభం.. కాసేపట్లో ఘట్‌కేసర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

by Kema Shiva Kumar |

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూసిన విషయం తెలిసిందే.

అందెశ్రీ అంతిమయాత్ర ప్రారంభం.. కాసేపట్లో ఘట్‌కేసర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ లాలాపేట (Lalapeta)లోని తన ఇంట్లో ఆదివారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలగా కుటుంబసభ్యులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అందెశ్రీని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రకటించారు. దీంతో ఆయన పార్థివ దేహాన్ని సోమవారం కుటుంబ సభ్యులు ప్రజల సందర్శనార్థం లాలాపేట‌లోని ఆయన నివాసానికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన అంతిమయాత్ర కాసేపటి క్రితం ప్రారంభమైంది. తార్నాక నుంచి ఉప్పల్ (Uppal) మీదుగా ఘుట్‌కేసర్‌ (Ghatkesar)‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌ (NFC Nagar) వరకు అంతిమ యాత్ర కొనసాగనుంది. మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పలువురు ప్రముఖులు, సాహితీ ప్రియులు ఘట్‌కేసర్‌కు చేరుకోనున్నారు.

Next Story