- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు.. పాడె మోసిన సీఎం రేవంత్‌రెడ్డి

దిశ, వెబ్‌డెస్క్/ఘట్‌కేసర్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ఘట్‌కేసర్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. అంతియ యాత్రలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్, అందెశ్రీ అభిమానులు, సాహితీ ప్రియులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అంతకు ముందు అందెశ్రీ పార్థివ దేహానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించి ఆయన పాడెను మోశారు. ఈ సందర్భంగా రోదిస్తున్న కుటుంబ సభ్యులను ఆయన ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఓదార్చారు. రెండు నిమిషాలు పాటు అందరూ మౌనం పాటించగా.. పోలీసులు గాల్లోకి మూడు రౌండ్ల పాటు గౌరవ సూచికంగా కాల్పులు జరిపారు. అనంతరం కుమారుడు దత్తసాయి తలకొరివి పెట్టగా.. అందెశ్రీ పార్ధివ దేహాన్ని సమాధి చేశారు.
కాగా, ఉదయం సీనియర్ నేత కేశవరావుతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు సీనియర్ నేత వీహెచ్‌లు అందెశ్రీ పార్థివ దేహానికి నివాళులర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. లాలాపేట్ నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్ వరకు అంతిమయాత్ర కొనసాగింది.






