- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజన్ డాక్యుమెంట్‌పై ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు
విజన్ డాక్యుమెంట్‌పై ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్కి్ల్ యూనివర్సిటీ చైర్మన్‌గా ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) అన్నారు. మంగళవారం ఆయన గ్లోబల్ సమ్మిట్‌లో మాట్లాడారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ దేశ భవిష్యత్తు. తెలంగాణ విజన్ చాలా మార్గదర్శకంగా ఉంది. అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రత్యేక మార్గంలో దూసుకెళ్తోందన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించారని కితాబిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి దార్శనికతకు అభినందనలు తెలిపారు. స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్‌గా ఉండాలని మొదట అడగ్గానే కంగారులో నో అని చెప్పేశా.. అప్పటికే టెక్ మహీంద్రా యూనివర్సిటీకి చైర్మన్‌గా ఉన్నందున వద్దని చెప్పాను. అయితే, రేవంత్ రెడ్డి లక్ష్యాలు, విజన్ విన్నాక తిరస్కరించలేకపోయాను. తెలంగాణ రైజింగ్ విజన్ బ్లూప్రింట్ చూశాను. ప్రజలు కేంద్రంగా దీన్ని రూపొందించారు’’ ఆనంద్ మహీంద్రా అని అన్నారు. కాగా, గ్లోబల్ సమిట్‌లో అన్ని సెషన్లు మగిశాయి. ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, అగ్రనటుడు చిరంజీవి, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.






