BRS: కవిత ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్.. హరీశ్, కవిత మధ్య పంచాయతీ ఈనాటిది కాదు.. కేసీఆర్ సన్నిహితుడు సెన్సేషనల్ కామెంట్స్

by Prasad Jukanti |   (  Updated:2025-09-05 06:16:26  IST  )

కవిత ఎపిసోడ్ లో ఊహించని ట్విస్టులు వైరల్ గా మారాయి.

BRS: కవిత ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్..  హరీశ్, కవిత మధ్య పంచాయతీ ఈనాటిది కాదు.. కేసీఆర్ సన్నిహితుడు సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కనుసైగతో శాసించిన బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఓ వైపు పార్టీ అధికారానికి దూరం కాగా ఇప్పుడు సొంత ఇంట్లో పుట్టిన ముసలం తీవ్ర దుమారం రేపుతోంది. కవిత (Kavitha) ధిక్కార స్వరం.. ఆమెను పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు ఓ ఎత్తైతే, హరీశ్ రావు (Harish Rao).. సంతోష్ రావులపై కవిత చేసిన వ్యాఖ్యలు స్టేట్ పాలిటిక్స్ లో రచ్చగా మారాయి. పదేళ్ల పాటు అన్నీ తానై రాష్ట్రాన్ని ముందుండి నడిపిన కేసీఆర్ కుటుంబంలో తాజా పరిణామాలు గులాబీ శ్రేణులను విస్మయానికి గురి చేస్తున్నాయి. అధినేత సొంత కుటుంబంలో మొదలైన ఈ అలజడి పార్టీ కార్యకర్తలను దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కల్వకుంట్ల కుటుంబంలో అసలేం జరుగుతోంది? ఈ పరిస్థితులకు ఎందుకు తలెత్తాయనేది రాష్ట్ర రాజకీయాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇన్నాళ్లు కేసీఆర్ కు కుడిభుజంగా ఉండి వ్యవహరించిన హరీశ్ రావుపై కవితకు పీకల్లోతు కోపం వెనుక కారణం ఏమై ఉంటుందనేది సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

కవిత, హరీశ్ పంచాయతీ ఇప్పటిది కాదు:

కేసీఆర్ కు చెడ్డ పేరు రావడంలో అసలు దోషి హరీశ్ రావేనంటుూ కవిత ఇచ్చిన స్టేట్ మెంట్ కారు పార్టీని షేక్ చేస్తోంది. దీంతో కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతోందనే చర్చ గుప్పుమంటోంది. ఇటువంటి తరుణంలో కేసీఆర్ సన్నిహితుడిగా పేరున్న గాదె ఇన్నయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత, హరీశ్ రావు మధ్య పంచాయతీ ఈనాటిది కాదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ టీవీ డిబేట్ లో పాల్గొన్న ఆయన.. 'కవిత, హరీశ్ రావు పంచాయతీ ఇప్పటిది కాదు. నాకు తెలియదా? 1999,2000 లో ఏం జరిగిందో తెలియదా? కానీ మనం బయటకు మాట్లాడొద్దు. ఆ కుటుంబాన్ని కించపరచవద్దు. అవమాన పరచవద్దు. కవితకు హరీశ్ రావుకు, కవితకు కేటీఆర్ కు, కవితకు ఇతరులతో ఉన్న పంచాయతీలు వేరు. శోభ వదిన (కేసీఆర్ సతీమణి) జోక్యం చేసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. శోభ వదిన నోరు తెరవాలి. కేసీఆర్ కుటుంబంలో మేము ఉన్నోళ్లం. శోభ వదిన పెడితే తిన్నవాళ్లం. అంటూ ఇన్నయ్య హాట్ కామెంట్స్ చేశారు. దీంతో 1999 లో అసలేం జరిగిందనేది సోషల్ మీడియాలో డిస్కషన్ గా మారింది.

ఫామ్ హౌస్ లో కవిత ఇన్ఫార్మర్:

ఫామ్ హౌస్ లో ఇప్పటికీ మీ సోదరుడు వంశీధర్ రావు (Vamsidhar Rao) ఉన్నారు కదా అని ఇన్నయ్య చేసిన వ్యాఖ్యలపై ఇదే డిబేట్ లో పాల్గొన్న కేసీఆర్ అన్న కూతురు రమ్యరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావును సైడ్ చేసే వ్యూహంలో భాగంగానే ఫామ్ హౌస్ లో నా సోదరుడు వంశీధర్ రావును పక్కన పెట్టుకున్నారని ఆరోపించారు. ఆయనను ఓ పావుగా వాడుకోవడానికే కవిత వంశీధర్ రావును ఇన్ఫార్మర్ గా పెట్టుకున్నారని హాట్ కామెంట్స్ చేశారు. హరీశ్ ను సిద్ధిపేట నుంచి పక్కకు జరిపేందుకు ఆయనను ఇబ్బంది పెట్టేందుకు వంశీధర్ రావును పావుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చచ్చిపోయిన 33 ఏళ్లకు మానాన్న రంగరావు పేరుతో సిద్ధిపేటలో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారని దాంతో హరీశ్ రావు ఫామ్ హౌస్ కు వెళ్లి నా పరిస్థితి ఏంటని అడిగితే అప్పుడు వంశీధర్ రావును మహారాష్ట్ర బీఆర్ఎస్ కు ఇన్ చార్జిగా పంపించారని ఆరోపించారని చెప్పారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఈ కుట్రకు ఎవరు కారణం అని ఆమె ప్రశ్నించారు.

అసలేం జరుగుతోంది?:

తాజాగా ఇన్నయ్య, రమ్యరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనంగా మారాయి. కవితకు, హరీశ్ రావుకు విభేదాలు మొదటి నుంచే ఉన్నాయని ఇన్నయ్య కామెంట్స్ చేయగా 1999లో ఏం జరిగిందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇక ఇన్నాళ్లు కేసీఆర్ వెంట ఉన్నది సంతోష్ రావేనని కవిత ఆరోపించగా ఇప్పుడు మరో వ్యక్తి వంశీధర్ రావు పేరు తెరపైకి రావడంతో కవిత ఎపిసోడ్ లో ఏం జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ వివాదానికి కారణాలు రాజకీయ అంశాలనేనా లేక కుటుంబ పంచాయతీలా అనేది సస్పెన్స్ గా మారింది.

Next Story