- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jubilee Hills: జూబ్లీహిల్స్ ప్రచారంలో ఒకే సారి ఎదురెదురుగా కాంగ్రెస్, బీఆర్ఎస్
జూబ్లీహిల్స్ ప్రచార పర్వం హోరాహోరీగా సాగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by poll) రాజకీయం ముదురుపాకాన పడుతోంది. అగ్రనేతల ప్రచారంలో ఈ సెగ్మెంట్‍లో హైవోల్టేజ్ రాజకీయం నడుస్తోంది. జూబ్లీ గడ్డపై జెండా పాతేందుకు స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వరుసగా రోడ్ షోలతో ప్రత్యర్థులను కార్నర్ చేస్తున్నారు. ఇక తమ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు గులాబీ పార్టీ తీవ్రంగా శ్రమిస్తుంటే ఇక్కడ తమ సత్తా చాటేందుకు కమలం పార్టీ సైతం పావులు కదుపుతోంది. జూబ్లీహిల్స్ లో హోరాహోరీగా సాగుతున్న ప్రచార పర్వంలో తాజాగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) శ్రేణులు పరస్పరం ఎదురుపడ్డాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల శ్రేణులు తమ తమ పార్టీలకు మద్దతుగా నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ముచ్చటించుకున్నారు. ఇందుకు సంబంధించిన విడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ సీన్ చూసిన నెటిజన్లు ఇది కదా తెలంగాణ అదే తెలంగాణ సంస్కృతి అందం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శాశ్వత శత్రువులు ఉండరని కేవలం సిద్ధాంతపరమైన తేడాలు మాత్రమే ఉంటాయని , ప్రేమ పంచడం మన రక్తంలోనే ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.






