తెలంగాణలో ఆసక్తికర పరిణామం.. మంత్రి ఇంట్లో డిన్నర్‌కి సీఎం సహా మంత్రులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-11 03:35:00  IST  )

తెలంగాణలో సరికొత్తగా డిన్నర్ పాలిటిక్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

తెలంగాణలో ఆసక్తికర పరిణామం.. మంత్రి ఇంట్లో డిన్నర్‌కి సీఎం సహా మంత్రులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఒక ప్రముఖ కన్వెన్షన్ హాల్‌లో టాప్ క్లాస్ విందును ఏర్పాటు చేశారు. అయితే, ఈ డిన్నర్ పస్తుతం పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ విందుకు ప్రభుత్వంలోని కీలక మంత్రులతో పాటు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ స్పెషల్ ఇన్విటేషన్లు సైతం అందాయి. రాబోయే రోజుల్లో అసెంబ్లీ వేదికగా తీసుకోబోయే నిర్ణయాలు, పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై ఈ డిన్నర్ వేదిగకా ప్రజాప్రతినిధుల మధ్య అనధికారిక చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

స్పెషల్ గెస్ట్‌లుగా సీఎం, డిప్యూటీ సీఎం

మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఇస్తున్న ఈ స్పెషల్ డిన్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డితో పాటు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా హాజరుకానున్నారు. ప్రభుత్వ అగ్రనేతలు ఇద్దరూ విచ్చేస్తుండటంతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం ఇదొక సాధారణ విందు సమావేశమా లేక రాబోయే పొలిటికల్‌గా వ్యూహాలకు పదును పెట్టేందుకు పెట్టిన డిన్నారా.. అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. సాయంత్రం జరిగే ఈ విందు భేటీపైనే అన్ని ప్రధాన పార్టీల కళ్లు ఉన్నాయి.

Next Story