CPI ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు అవమానం.. పక్కకు నెట్టేయబోయిన సీఐ

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-16 14:41:39  IST  )

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనలో సీపీఐ(CPI) ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం(Nellikanti Sathyam)కు ఘోర అవమానం జరిగింది.

CPI ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు అవమానం.. పక్కకు నెట్టేయబోయిన సీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనలో సీపీఐ(CPI) ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం(Nellikanti Sathyam)కు ఘోర అవమానం జరిగింది. గుర్తుపట్టకుండా ఓ పోలీస్ అధికారి సీపీఐ ఎమ్మెల్సీని పక్కకు నెట్టబోయాడు. మంగళవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy)తో కలిసి సురవరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించే క్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంను సీఐ పక్కకు గుంజి పడేసే ప్రయత్నం చేశారు. పక్కనే ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ అతను ఎమ్మెల్సీ అని చెప్పడంతో సదరు సీఐ సారీ చెప్పారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వీడియో

Next Story