- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్రిగుట్టల్లో ఐఈడీ పేలి జవానుకు తీవ్రగాయాలు
ఛత్తీస్‍గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో పామునూరు వద్ద మందు పాతర పేలి నవదీప్ పాఠక్ అనే జవాన్ తీవ్రంగా గాయపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: మావోయిస్టుల ఏరివేతలో భాగంగా ఛత్తీస్ గఢ్(Chhattisgar)- తెలంగాణ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో (Karregutta) భద్రతా దళాలు మరోసారి పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ లో భాగంగా భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో ఛత్తీస్ గఢ్- తెలంగాణ (Telangana) సరిహద్దుల్లోని పామునూరు వద్ద సైనికులకు భారీ ప్రమాదం తప్పింది. రోడ్డు నిర్మాణపు పనుల్లో పామునూరు వద్ద తనిఖీలు చేస్తుండగా మావోయిస్టులు అమర్చిన11 మందుపాతరలు పోలీసులు నిర్వీర్యం చేశారు. పన్నెండవ మందుపాతర (Landmine Blast) నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలిపోయింది. ఈ ఘటనలో నవదీప్ పాఠక్ అనే జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతడిని హుటాహుటీన హెలికాప్టర్‍లో వెంకటాపురం తరలించారు. వెంకటాపురం నుంచి వరంగల్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.






