Hyderabad: చేప ప్రసాదం పంపిణీలో విషాదం..!

by velandi.Saikiran |   (  Updated:2025-06-08 10:11:44  IST  )

హైదరాబాద్ లోని నాంపల్లిలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీలో తీవ్ర విషాదం నెలకొంది. చేప ప్రసాదం కోసం క్యూ లైన్ లో నిలబడ్డ

Hyderabad: చేప ప్రసాదం పంపిణీలో విషాదం..!
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని నాంపల్లిలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీలో ( chepa prasadam) తీవ్ర విషాదం నెలకొంది. చేప ప్రసాదం కోసం క్యూ లైన్ లో నిలబడ్డ వృద్ధుడు... ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. అతనికి గుండెపోటు వచ్చిందని... ఈ తరుణంలోనే క్యూ లైన్ లోనే మరణించి ఉంటాడని చెబుతున్నారు అధికారులు.

కాగా చేప ప్రసాదం కోసం క్యూ లైన్ లో నిలబడి మరణించిన ఆ వృద్ధుడు మెదక్ జిల్లాకు ( Medak district) సంబంధించిన సత్యనారాయణ అని తెలుస్తోంది. సత్యనారాయణ వయసు 77 సంవత్సరాల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అతని మృతి నేపథ్యంలో చేప ప్రసాదం పంపిణీ దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది ఇలా ఉండగా... ఇవాళ, రేపు హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ( Nampally Exhibition Ground ) చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయమే చేప ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. ఈ మేరకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను దాదాపు 140 కేటాయించారు. అలాగే.. నాంపల్లి దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి.

Next Story