- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు.. కారణమిదే!
by Gantepaka Srikanth |
కేంద్ర హంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) హైదరాబాద్ పర్యటన రద్దు అయింది.

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) హైదరాబాద్ పర్యటన రద్దు అయింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నాహకంలో భాగంగా అమిత్ షా పర్యటన రద్దు చేసినట్లు హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. కాగా, గణేష్ నిమజ్జనంలో పాల్గొనేందుకు ఈ నెల 6న హైదరాబాద్‌కు వస్తారని బీజేపీ తెలంగాణ(BJP Telangana) అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. నగరంలోని మెజాంజాహీ మార్కెట్ వద్ద గణనాథులకు స్వాగతం పలకడంతో పాటు గణేష్ శోభాయాత్రను ఉద్దేశించి ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఆయన పర్యటన రద్దు అయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్న విషయం తెలిసిందే.
Next Story






