అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదా.. రీజన్ ఇదేనంటా..!

by Disha Web Desk 14 |
అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదా.. రీజన్ ఇదేనంటా..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణకు రావాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు ఇవాళ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. మంత్రి అమిత్ షా రేపు తెలంగాణలో పర్యటించాల్సిన కార్యక్రమం ఉండేదని. కానీ కొన్ని అత్యవసర పనుల వల్ల రాష్ట్రంలో అమిత్ షా పర్యటన వాయిదా పడిందన్నారు. కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాద్ సమావేశాలు వాయిదా వేయడం అయినదని పేర్కొన్నారు.

బీహార్ రాజకీయ పరిమాణాలతో పర్యటన వాయిదా..!

బీహార్ రాజకీయ పరిమాణాల నేపథ్యంలో అమిత్ షా పర్యటన వాయిదా వేసుకున్నట్లు సమాచారం. అమిత్ షా తెలంగాణ టూర్ వాయిదాబీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సీఎం నితీశ్‌కుమార్‌ భావిస్తున్నట్లు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. బీహార్ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సీఎం నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ, లాలూ యాదవ్‌ ఆధ్వర్యంలోని ఆర్జేడీ పార్టీల మధ్య విభేదాలు ఉన్న నేపథ్యంలో బీహార్ రాజకీయాలు తీవ్ర ఆసక్తి గా మారాయి.


Next Story

Most Viewed