- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అమిత్ అరోరాకు ఏడు రోజుల కస్టడీ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన అమిత్ అరోరాకు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది.

దిశ,డైనమిక్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన అమిత్ అరోరాకు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సన్నిహితుడైన అమిత్ అరోరాను ఈడీ బుధవారం అదుపులోకి తీసుకుంది. ఆయనను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ.. అమిత్ ను 14 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరింది. అయితే తనను ఇప్పటికే 22 సార్లు ప్రశ్నించారని అమిత్ అరోరా కోర్టు దృష్టికి తీసుకువచ్చాడు. అలాగే విజయ్ నాయర్, సిసోడియాను తాను ఎప్పుడూ కలవలదేని కోర్టుకు తెలిపాడు. దీంతో 22 సార్లు ప్రశ్నించాక మళ్లీ కస్టడీకి ఎందుకు అని కోర్టు ఈడీని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన ఈడీ మూడు సార్లు అమిత్ అరోరా వాంగ్మూలం నమోదు చేశామని అయితే కేసులో సమగ్ర దర్యాప్తు కోసమే కస్టడీకి కోరుతున్నట్టు తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు అమిత్ అరోరాకు ఏడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.
READ MORE
వచ్చే ఎన్నికల్లో BJP అధికారంలోకి రావడం ఖాయం: Former Minister Babu Mohan






