సైబర్ నేరగాడు అరెస్ట్.. తెలంగాణ పోలీసులకు అమెరికన్ సీఈవో ధన్యవాదాలు

by Muthe.Rajitha |

తెలంగాణ పోలీసులకు ఆ అమెరికన్ కంపెనీ సీఈవో ధన్యవాదాలు తెలిపాడు.

సైబర్ నేరగాడు అరెస్ట్.. తెలంగాణ పోలీసులకు అమెరికన్ సీఈవో ధన్యవాదాలు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ పోలీసులకు ఆ అమెరికన్ కంపెనీ సీఈవో ధన్యవాదాలు తెలిపాడు. క్రిప్టో కరెన్సీ సంస్థ కాయిన్‌బేస్‌పై జరిగిన భారీ హ్యాకింగ్‌ కేసులో నిందితుడిని అరెస్టు చేయడంపై అమెరికన్‌ సీఈఓ బ్రియాన్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ హైదరాబాద్‌ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో కాయిన్‌బేస్‌ సంస్థపై సైబర్‌ దాడి జరిగింది. కస్టమర్ల డేటా దొంగిలించేందుకు హ్యాకర్లు యూఎస్ వెలుపల ఉన్న ఇదే సంస్థకు చెందిన వ్యక్తులకు లంచాలు ఇచ్చారు. ఈ ఘటన వల్ల సుమారు 400 మిలియన్‌ డాలర్ల వరకు నష్టం వాటిల్లి ఉండొచ్చని సంస్థ అంచనా వేసింది.

నిందితులకు కఠిన శిక్ష పడేలా చేసే దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తామని కాయిన్‌బేస్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో భారత్‌లో ఈ నేరంతో లింక్ ఉన్న ఓ మాజీ ఏజెంట్‌ను ఇటీవల తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసారు. దీనిపై స్పందించిన బ్రియాన్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌.. "హైదరాబాద్‌ పోలీసులకు ధన్యవాదాలు, హ్యాకర్లకు సహకరించిన మిగతావారికీ ఇదే గతి పడుతుంది’’ అని ట్వీట్ చేసారు.

Next Story