- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్ఆర్ఎస్ రూల్స్‌కు సవరణలు
తెలంగాణ ల్యాండ్ రెగ్యులరైజేషన్ రూల్స్-2020ను మెట్రోపాలిటన్, అర్బన్ డవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ సవరించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ల్యాండ్ రెగ్యులరైజేషన్ రూల్స్-2020ను మెట్రోపాలిటన్, అర్బన్ డవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ సవరించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆ శాఖ కార్యదర్శి కె.ఇలంబర్తి గురువారం జారీచేశారు. ముఖ్యంగా 2020లో అప్పటి ప్రభుత్వం జారీచేసిన జీఓ ఎంఎస్ నెం.131ని సవరించిన ప్రభుత్వం జీఓ ఎంఎస్ నెం.98ని జారీచేసింది. అయితే తెలంగాణ ల్యాండ్ రెగ్యులరైజేషన్ రూల్స్-2020 ప్రకారం రిజిస్టర్డ్ సేల్ డీడ్, రిజిస్టర్డ్ డీడ్, రిజిస్టర్డ్ సేల్ డీడ్/టైటిల్ డీడ్ లతో కూడిన ఆమోదం పొందని, అక్రమ లేఅవుట్లను మాత్రమే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటున్నది. కానీ ఇక నుంచి రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్/రిజిస్టర్డ్ ఎక్స్ఛేంజ్ డీడ్, వారసత్వం ద్వారా వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకోవడంతోపాటు సంబంధిత భూముల్లో చేసిన ఆమోదం పొందని, అక్రమ లేఅవుట్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.






