కేంద్ర విత్తన చట్టం ముసాయిదాలో సవరణలు చేయాలి.. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

by Kema Shiva Kumar |

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన విత్తన చట్టం -2025 ముసాయిదాలో సవరణలు చేయాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు

కేంద్ర విత్తన చట్టం ముసాయిదాలో సవరణలు చేయాలి.. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన విత్తన చట్టం -2025 ముసాయిదాలో సవరణలు చేయాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ విత్తన చట్టంలో చాలా లొసుగులున్నాయని రైతుల ప్రయోజనం కోసం చట్టం ఉండేలా చూడాలన్నారు. మల్టీ నేషనల్ విత్తన కంపెనీల కోసం ప్రత్యేకంగా చట్టాలు రూపొందించాల్సిన అవసరం లేదని వివరించారు. విత్తన చట్టం ముసాయిదాపై రైతు కమిషన్ ఆధ్వర్యంలో విస్తృతంగా సమీక్ష, సమావేశాలు నిర్వహించామన్నారు. ఈ నెల డిసెంబర్ 2న నిర్వహించిన సమావేశంలో వివిధ పార్టీల నేతలు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు, రైతు సంఘాల నేతలు, వ్యవసాయరంగ నిపుణులు, రిటైర్డ్ అధికారులు పాల్గొన్నారని తెలిపారు. ఈ నెల 6న విత్తన కంపెనీల ప్రతినిధులతో కమిషన్ మరోసారి సమావేశం నిర్వహించిందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగ నిపుణుల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన సూచనలను సైతం పరిశీలించి, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చట్టంలో చేయాల్సిన సవరణలపై ఓ నివేదికను రూపొందించినట్లు కోదండరెడ్డి తెలిపారు. విత్తన చట్టంలో సవరణలపై తయారుచేసిన నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతున్నట్లు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు.

Next Story