పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల ఏర్పాటులో అంబేద్కర్‌ది కీలక పాత్ర.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

by Kema Shiva Kumar |

ఉద్యోగ నియామకాల విషయంలో సర్వీస్‌ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు.

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల ఏర్పాటులో అంబేద్కర్‌ది కీలక పాత్ర.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
X

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగ నియామకాల విషయంలో సర్వీస్‌ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్స్‌ ఛైర్‌పర్సన్ల నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. 1950 తర్వాత యూపీఎస్సీ, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల ఏర్పాటు మొదలైందని తెలిపారు. ఆ కమిషన్ల విషయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీలో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారం అవసరమని అని అన్నారు. నియామకాల్లో అత్యంత పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని రాష్ట్రపతి తెలిపారు.

Next Story