అంబేడ్కరిజమే దేశానికి రక్ష : రఘునందన్ రావు

by Disha Web Desk 4 |
అంబేడ్కరిజమే దేశానికి రక్ష : రఘునందన్ రావు
X

దిశ, చేగుంట : భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన బాట దేశానికి రక్షగా ఉంటుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని హిరియూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి భారతదేశానికి అనువుగా ఉండే రాజ్యాంగాన్ని రాయడంలో అంబేద్కర్ కీలక పాత్ర వహించారని పేర్కొన్నారు.

ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బలహీన వర్గాల ప్రజలు అనుభవిస్తున్న రిజర్వేషన్ ఫలాలు అంబేడ్కర్ వల్లే వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సైతం అంబేద్కర్ రాజ్యాంగం వల్లే సాకారమైందని పేర్కొన్నారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పూర్ణిమతో కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలో దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు పాల్గొని దిశా నిర్దేశం చేశారు. వేడుకల్లో స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story