అంతర్జాతీయ స్థాయిలో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి గౌరవం.. AAOUకు ప్రొ. ఘంటా చక్రపాణి

by Ramesh Naini |

ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఓపెన్ యూనివర్సిటీస్ (ఏఏఓయూ) కార్యనిర్వాహక సభ్యులుగా డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ.ఘంటా చక్రపాణి ఎంపికయ్యారు.

అంతర్జాతీయ స్థాయిలో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి గౌరవం.. AAOUకు ప్రొ. ఘంటా చక్రపాణి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఓపెన్ యూనివర్సిటీస్ (ఏఏఓయూ) కార్యనిర్వాహక సభ్యులుగా డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ.ఘంటా చక్రపాణి ఎంపికయ్యారు. 2026-2028 కాలానికి కార్యనిర్వాహక సభ్యులుగా ప్రొ. ఘంటా చక్రపాణి ని నియమిస్తూ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ ఓపెన్ యూనివర్సిటీస్ (ఏఏఓయూ) సెక్రటరీ జనరల్ ప్రొ. రహమత్ బుదిమాన్ అధికారిక సమాచారాన్ని పంపించారు. ఆసియా ఖండంలోని అన్ని ఓపెన్ యూనివర్సిటీలు ఇందులో సభ్యులుగా ఉంటారు. బీజింగ్‌లో ఇటీవల జరిగిన 2025 సంవత్సరపు సాధారణ సర్వ సభ్య సమావేశంలో ఏఏఓయూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రొ.ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏఏఓయూకు కార్యనిర్వాహక సభ్యులుగా ఎంపిక కావడం తమ భాద్యతను మరింత పెంచిందన్నారు. తెలంగాణలో సార్వత్రిక విద్య గ్రామీణ ప్రాంతంలో మరింత విస్తరించేలా, అందరికీ అందుబాటులో ఉన్నత విద్య ఉండేలా ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రొ.ఘంటా చక్రపాణి ని రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి, పలువురు డైరెక్టర్లు ప్రొ. పుష్ప చక్రపాణి, ప్రొ. రాబింద్రనాథ్ సోలమన్, ప్రొ. రాణి రజిత మాధురి, ప్రొ. రజని, ప్రొ. భోజు శ్రీనివాస్, డా. రమాదేవి, డా. దయాకర్ తదితరులు అభినందించారు.

Next Story