- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRAOU: గుడ్‌న్యూస్.. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు
హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాల గడువును పెంచారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (Ambedkar Open University) డిగ్రీ, పీజీ ప్రవేశాల (Admissions) గడువును పెంచినట్లు విద్యార్థులకు అధికారులు గుడ్‌న్యూస్ తెలిపారు. వర్సిటీ డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ) కోర్సులు, పీజీ (ఎంఏ/ ఎంకాం/ ఎంఎస్సీ, ఎంబీఏ) కోర్సులు, B.Lisc, M.Lisc, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను చివరి తేదీ సెప్టెంబర్ 26 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి సమాచారం, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నెంబర్‌లు 040-23680 333 / 444 / 555, టోల్‌ఫ్రీ నెంబర్ 18005990101 లో సంప్రదించవచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in లేదా www.braou.ac.in లో సంప్రదించాలన్నారు. అలాగే రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజు చెల్లింపునకు సెప్టెంబర్ 26 చివరి తేదీ అని తెలిపారు.






