సూర్యరశ్మిలో వెలిగిపోతున్న బాబాసాహెబ్.. 'సన్ లైట్ ఆర్ట్'తో యువకుడి వినూత్న ప్రయోగం

by Ramesh Naini |

ఓ యువకుడు సరికొత్తగా 'సన్ లైట్ ఆర్ట్' (Sunlight Art) సూర్యరశ్మి ద్వారా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ చిత్రాన్ని ఆవిష్కరిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

సూర్యరశ్మిలో వెలిగిపోతున్న బాబాసాహెబ్.. సన్ లైట్ ఆర్ట్తో యువకుడి వినూత్న ప్రయోగం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఓ యువకుడు సరికొత్తగా 'సన్ లైట్ ఆర్ట్' (Sunlight Art) సూర్యరశ్మి ద్వారా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ చిత్రాన్ని ఆవిష్కరిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా చిత్రాలను రంగులతోనో, పెన్సిల్ తోనో గీస్తారు. కానీ, 'సూర్య' అనే ఈ యువ కళాకారుడు కేవలం భూతద్దం, ఒక చెక్కను కాన్వాస్‌గా ఉపయోగిస్తూ సూర్యరశ్మిని వాడుకుంటూ అంబేడ్కర్ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. కాంతితో రూపొందిన ఈ కళాఖండం జ్ఞానోదయానికి చిహ్నంగా నిలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్..

సూర్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా (surya_sunlight_artist)లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సన్ లైట్‌తో చేసిన అంబేడ్కర్ రూపం స్పష్టంగా కనిపిస్తున్న తీరు చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. ‘అక్షరాయుధంతో చీకట్లను చీల్చిన మహనీయుడిని, ఇలా వెలుగుతో ఆవిష్కరించడం అద్భుతం’ అంటూ పలువురు ప్రశంసల జల్లు కురిపించారు. కాగా, సూర్య కేవలం అంబేడ్కర్ చిత్రమే కాకుండా, సూర్య ఇదే పద్ధతిలో పలువురు ప్రముఖుల చిత్రాలను, విభిన్న కళాకృతులను రూపొందిస్తూ 'సన్ లైట్ ఆర్టిస్ట్'గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Next Story