బిట్స్ పిలానీకి రూ.9 కోట్ల విరాళం

by Gantepaka Srikanth |

బిట్స్ పిలానీకి రూ.9 కోట్ల విరాళం

బిట్స్ పిలానీకి రూ.9 కోట్ల విరాళం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీ(BITS Pilani) యూనివర్సిటీకి భారీగా విరాళాలు వచ్చాయి. యూనివర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థులు ఏకంగా రూ.9 కోట్ల విరాళం ఇచ్చారు. బుధవారం వీసీని కలిసి స్వయంగా అందించారు. కాగా, ఇటీవలే బిట్స్ పిలానీ సరికొత్త ఆవిష్కరణ చేసింది. ఆహారంలో పురుగు మందుల అవశేషాలను గుర్తించే ఒక పోర్టబుల్ పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఈ పరికరం ద్వారా పండ్లు, కూరగాయలపై ఉండే పురుగు మందు అవశేషాలను ఈజీగా గుర్తించవ్చు. ఈ పరికరం కెమిలుమినిసెన్స్ ప్రక్రియ ద్వారా వెంటనే గుర్తిస్తుంది. దీని ధర రూ. 5,000 నుంచి రూ. 10,000 వరకు ఉంటుంది. చేతిలో సరిపోయే ఈ పరికరాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.

Next Story