అలుగు వర్షిణీ పవర్స్ కట్.. ఇక సెంట్రలైజ్డ్ అడ్మిషన్లకు స్వస్తి

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-16 02:00:52  IST  )

ఎస్సీ గురుకులాల సెక్రెటరీ అలుగు వర్షిణీ పవర్స్‌ను ప్రభుత్వం కట్ చేసినట్లు తెలుస్తున్నది.

అలుగు వర్షిణీ పవర్స్ కట్.. ఇక సెంట్రలైజ్డ్ అడ్మిషన్లకు స్వస్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్సీ గురుకులాల సెక్రెటరీ అలుగు వర్షిణీ పవర్స్‌ను ప్రభుత్వం కట్ చేసినట్లు తెలుస్తున్నది. ఇంత కాలం ఆమె పర్యవేక్షణలోనే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింది. దీంతో ఆమె ఏకకాలంలో మూడు గురుకులాల్లో సాగుతోన్న పనులను పర్యవేక్షించడం లేదని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వివిధ సమస్యలతో ఆమె వద్దకు వచ్చే పిల్లలు, పేరెంట్స్‌కు సైతం పెద్దగా సమయం ఇవ్వట్లేదని విమర్శలొచ్చాయి. అందుకని ప్రస్తుతం కొనసాగుతోన్న సెంట్రలైజ్‌డ్ అడ్మిషన్ విధానానికి పుల్‌స్టాప్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇప్పటి నుంచి ఏ శాఖకు సంబంధించిన అడ్మిషన్లు ఆ శాఖకు చెందిన సెక్రెటరీలే మానిటరింగ్ చేయాలని ఆదేశించినట్టు తెలిసింది.

వివాదాస్పదంగా మారాయని..

బీఆర్ఎస్ హయం నుంచి బీసీ గురుకులాల్లోని అడ్మిషన్లు మాత్రం విడిగా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లోని అడ్మిషన్లు ఎస్సీ గురుకులాల సెక్రెటరీ పర్యవేక్షణలో జరిగేవి. అదే పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నది. అయితే ఎస్సీ గురుకులాల సెక్రెటరీగా అలుగు వర్షిణీ బాధ్యతలు తీసుకున్న తర్వాత సెంట్రలైజ్‌డ్ అడ్మిషన్లు వివాదాస్పదంగా మారాయని విమర్శలున్నాయి. అడ్మిషన్ల సమయంలో వచ్చే వినతులను పరిష్కరించకపోవడంతో బాధితులు మంత్రి వద్దకు క్యూ కట్టారు. కొందరు ప్రజాప్రతినిధులు వర్షిణీ తీరుపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తున్నది. అమె ఒంటెద్దు పోకడలతో మొత్తం గురుకులాలకు చెడ్డ పేరు వస్తుందని మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌కు ఫిర్యాదు చేయడంతో డీ-సెంట్రలైజ్‌డ్ అడ్మిషన్ల సిస్టమ్ అమల్లోకి తేవాలని మంత్రి భావించినట్లు తెలిసింది.

Next Story