- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీ అవ్వ తగ్గేదే లే...కేసీఆర్ సభలో అల్లు అర్జున్ ఫ్లెక్సీ.. !
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ( KCR )సభలో అల్లు అర్జున్ (allu arjun ) ఫ్లెక్సీ మెరిసింది.

దిశ వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ( KCR )సభలో అల్లు అర్జున్ (allu arjun ) ఫ్లెక్సీ మెరిసింది. గులాబీ పార్టీ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో వరంగల్ జిల్లాలో ( Warangal).... రజతోత్సవం పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాదాపు 5 నుంచి 6 లక్షల మంది... సభకు హాజరైనట్లు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో...కేసీఆర్ సభలో హీరో అల్లు అర్జున్ ఫ్లెక్సీ.. కలకలం సృష్టించింది.
పుష్ప 2 సినిమాలోని ( Pushpa 2) అల్లు అర్జున్ ఓ ఫోజ్ ను ... ఈ ఫ్లెక్సీ లో ఏర్పాటు చేశారు. అంతేకాదు తగ్గేదేలే.. .కేసీఆర్ అంటే పేరు కాదు... .కేసీఆర్ అంటే బ్రాండ్... అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ను ఈ రాశారు గులాబీ పార్టీ నేతలు. అయితే గులాబీ పార్టీలో ఉన్న కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్.. ఈ ఫ్లెక్సీ ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఫ్లెక్సీని వరంగల్ సభలో... ఏర్పాటు చేసి.. .కేసీఆర్ అలాగే అల్లు అర్జున్ పై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా వరంగల్ సభలో కేసీఆర్ దాదాపు గంట పాటు ప్రసంగించారు. ఈ సందర్భంగా గత పది సంవత్సరాలలో గులాబీ పార్టీ సాధించిన విజయాలు... అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.






