- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Chanchalguda Jail: రాత్రంతా మేల్కొనే ఉన్న అల్లు అర్జున్.. జైలు అధికారులను పదే పదే ఏం అడిగారో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: సంధ్య థియేటర్(Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్(Allu Arjun)ను హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులు(Chikkadapally Police) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టు(Nampally Court)లో హాజరుపర్చగా.. 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో శుక్రవారం రాత్రి మొత్తం చంచల్‌గూడ జైల్లో(Chanchalguda Jail)నే గడిపారు. రాత్రి మొత్తం మంజీరా బ్యారక్-1లో నిద్రపోకుండా అలాగే మేల్కొని ఉన్నట్లు సమాచారం. జైలు అధికారులతో తప్ప మరెవరితోనూ మాట్లాడలేదని సన్నిహితుల ద్వారా తెలిసింది. అసలు ఏం తినకుండా.. ఒంటరిగా గడిపారని జైలు అధికారులు చెప్పారు. పడుకునేందుకు దుప్పటి, రగ్గు ఇచ్చినా పడుకోకుండా.. నన్ను ఎప్పుడు విడుదల చేస్తారని పదే పదే జైలు అధికారులను అడిగినట్లు సమాచారం. ఇవాళ ఉదయం జైలు నుంచి విడుదలయ్యాక మీడియాతో మాట్లాడారు. తాను బాగానే ఉన్నానని. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. చట్టాన్ని గౌరవిస్తాను. నాకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు అని అన్నారు.