సనాతన ధర్మం గురించి పవన్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు: అల్లు అరవింద్

by Ajay Maddhiboyina |

మ‌హావ‌తార్ న‌ర‌సింహ చిత్రం స‌క్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అర‌వింద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సనాత‌న ధ‌ర్మం గురించి మాట్లాడుతుంటే

సనాతన ధర్మం గురించి పవన్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు: అల్లు అరవింద్
X

దిశ‌, వెబ్ డెస్క్: మ‌హావ‌తార్ న‌ర‌సింహ చిత్రం స‌క్సెస్ మీట్ లో నిర్మాత అల్లు అర‌వింద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సనాత‌న ధ‌ర్మం గురించి మాట్లాడుతుంటే ఎవ‌రైరా మంత్ర‌ముగ‌ర్ధులు అవ్వాల్సిందేనని అన్నారు. స‌నాత‌న ధ‌ర్మం గురించి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు అపార‌మైన అవ‌గాహ‌న ఉంద‌ని చెప్పారు. త‌న‌కు తెలిసిన వారిలో కానీ త‌మ కుటుంబ స‌భ్యుల్లో కానీ ప‌వ‌న్‌కు తెలిసినంతగా సనాతన ధర్మం గురించి ఎవ్వరికీ తెలియని అన్నారు.

పవన్ కు తెలిసినంతగా సనాతన ధర్మం గురించి తెలిసిన వాళ్లు ఇంకెవరూ లేరని చెప్పారు. ఆయన మహావతార్ నరసింహ సినిమా చూడాలని, ఈ సినిమా గురించి మాట్లాడాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇదిలా ఉంటే కేవలం యానిమేషన్‌తో వచ్చిన మహావతార్ నరసింహా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. విడుదలైన నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి రూ.79 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించగా తెలుగులో అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ విడుదల చేసింది.

Next Story