Telangana Budget 2023: బీసీల సంక్షేమానికి కేటాయింపు ఇలా!

by Disha Web Desk 4 |
Telangana Budget 2023: బీసీల సంక్షేమానికి కేటాయింపు ఇలా!
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రస్తావించారు. వృత్తి పనులపై ఆధారపడి జీవిస్తున్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలను రూపొందించడంతో తమ ప్రభుత్వం కమిట్ మెంట్ తో ఉందన్నారు. గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నగొల్ల కురుమలకు చేయూతనివ్వడం కోసం ప్రభుత్వం భారీ ఎత్తున గొర్రెల పంపిణీ చేపట్టిందన్నారు. చేనేతలకు అండగా నిలిచేందుకు బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేసే చీరల తయారీ ఆర్డర్లను చేనేత, పవర్ లూమ్ పరిశ్రమలకు అప్పగిస్తోందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సర్వే నిర్వహించి చేనేత, పవర్ లూమ్ కార్మికులను గుర్తించి వారికి జియోట్యాగింగ్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం అందించే ప్రొత్సాహకాలు, పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ అవుతున్నాయన్నారు. నేతన్న బీమా పథకం ద్వారా రూ.5లక్షల బీమా అందిస్తున్నామన్నారు. బీసీ గురుకులాలను గణనీయంగా పెంచామన్నారు. గీత కార్మికులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీరాను సాఫ్ట్ డ్రింక్ గా మార్చి అందించే ప్రాజెక్ట్ ను చేపట్టిందన్నారు. బీసీల సంక్షేమం కోసం ఈ బడ్జెట్ లో రూ.6,229 కోట్లు కేటాయిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు.

Also Read..

Telangana Budget 2023: బడ్జెట్.. సంక్షేమానికి భారీగా నిధులు


Next Story

Most Viewed