ప్రభుత్వానికి చేతకాక బీజేపీపై నిందలు.. హైకోర్టు తీర్పుపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందన

by Ramesh Naini |

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై గురువారం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు.

ప్రభుత్వానికి చేతకాక బీజేపీపై నిందలు.. హైకోర్టు తీర్పుపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందన
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల (High Court) అంశంపై గురువారం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) స్పందించారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు స్టే విధించడం బాధాకరమన్నారు. బీజేపీ బీసీల పక్ష పాతి అని, హైకోర్టు‌లో రిజర్వేషన్ కొట్టేస్తే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు కి వెళ్ళిందని గుర్తుకు చేశారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు బీజేపీ మద్దతు ఇచ్చిందని తెలిపారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం వల్ల అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా గాడి తప్పిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాక బీజేపీ పై నిందలు వేస్తున్నారని తెలిపారు. గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్నప్పుడు ఎందుకో జీవో ఇచ్చారని వెల్లడించారు. గ్రామ పంచాయతీలో నిధులు లేక అభివృద్ధి కుంటుపడుతుందని వివరించారు. గ్రామ పంచాయతీలు నిర్వర్యం అవుతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. BC ల ఆత్మ గౌరవం దెబ్బ తీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, త్వరలోనే కాంగ్రెస్‌కు ప్రజల బుద్ధి చెప్తారని వెల్లడించారు.

Next Story