- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పూజకు పనికిరాని పువ్వు బీజేపీ అయితే’.. కేటీఆర్‌కు ఏలేటి కౌంటర్..
బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కీలక నేత, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్(KTR) చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కీలక నేత, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీపై కేటీఆర్ విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. బీజేపీ(BJP)ని పూజకు పనికిరాని పువ్వు అంటున్నారు.. కానీ రాష్ట్రానికి పనికి రావట్లేదనే ప్రజలు కారును షెడ్డుకు పంపించారని.. ఆ విషయం గుర్తు ఉంచుకొని మాట్లాడాలని కేటీఆర్‌కు ఏలేటి కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ వంటి ఎన్నో స్కామ్‌లలో ఇరుక్కున్న బీఆర్ఎస్ నేతలు బీజేపీ గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కటంటే.. ఒక్క సీటు కూడా గెలవలేదు.. అక్కడే ప్రజల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో తెలిసిపోయిందని అన్నారు.
మరోవైపు.. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిందని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధుపై తన విధి విధానాలు ఏందో చెప్పిందని అన్నారు. రాష్ట్ర రైతాంగం మీద కాంగ్రెస్ ప్రభుత్వ విధి విధానాలు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. రైతు సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫల అయిందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.






