క్షణం ఆలోచించకుండా రాజకీయ సన్యాసం తీసుకుంటా.. CM రేవంత్‌కు ఏలేటి సవాల్

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

క్షణం ఆలోచించకుండా రాజకీయ సన్యాసం తీసుకుంటా.. CM రేవంత్‌కు ఏలేటి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌ చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే రాష్ట్రంలో తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన.. రాష్ట్రంలోని అన్ని ZPలను గెలిచి చూపించాలి సవాల్ చేశారు. కాంగ్రెస్ అన్ని ZPలు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సంచలన ప్రకటన చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరిట రేవంత్‌ నాటకాలు ఆపాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడే అర్హత రేవంత్‌, రాహుల్ ఇద్దరికీ లేదని అన్నారు. మోడీని ప్రధాని పదవి నుంచి దింపేయడం రాహుల్‌, సోనియా వల్లే కాలేదు.. ఇక రేవంత్ రెడ్డి సామర్థ్యం ఎంతో చూసుకోవాలని చెప్పారు. అంతేకాదు.. ఈ జన్మలో రాహుల్ గాంధీ ప్రధాని కాలేడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Next Story