అన్ని షూటింగ్స్ బంద్.. నిర్మాతల మండలి అత్యవసర భేటీ షురూ

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-04 06:43:48  IST  )

చిత్ర పరిశ్రమలో వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికుల వేతలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (Telugu Film Employees Federation) ఇవాళ్టి నుంచి షూటింగ్స్‌ బంద్‌కు పిలునిచ్చింది.

అన్ని షూటింగ్స్ బంద్.. నిర్మాతల మండలి అత్యవసర భేటీ షురూ
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్ర పరిశ్రమలో వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికుల వేతలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (Telugu Film Employees Federation) ఇవాళ్టి నుంచి షూటింగ్స్‌ బంద్‌కు పిలునిచ్చింది. ఈ హఠాత్పరిణామంతో సెట్స్‌పై ఉన్న మూవీ షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ డిమాండ్లపై ఇవాళ ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతల మండలి అత్యవసర సమావేశమైంది. ఈ సమావేశానికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు అల్లు అరవింద్, మైత్రీ రవి, సురేష్ బాబు, శివలెంక కృష్ణ ప్రసాద్, రాధామోహన్, బాపినీడు, ఠాగూర్ మధు, ఫెడరేషన్ సభ్యులు, ఫిలిం ఛాంబర్ సభ్యులు హాజరయ్యారు. భేటీలో ప్రధానంగా కార్మికుల వేతనాల పెంపుపై చర్చించి ఓ ప్రకటనను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

Next Story