- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సకల జనులు సుఖ సంతోషాలతో జీవించాలి.. ప్రజలందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పిన కేసీఆర్
2026 నూతన సంవత్సరం సందర్భంగా భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: 2026 నూతన సంవత్సరం సందర్భంగా భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఆయన మీడియాకు ఓ సందేశాన్ని విడుదల చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు చిత్తశుద్ధితో, రాజీలేని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కొత్త ఏడాదిలో రెట్టించిన పట్టుదలతో ప్రజలు అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా నూతన సంవత్సరంలో వ్యవసాయం, సాగునీటి రంగాలు గాడిన పడి అభివృద్ధి చెందాలని, తెలంగాణ రైతాంగం, మహిళలు, యువత, సకల జనులు సుఖ సంతోషాలతో, ఆరోగ్యవంతంగా జీవించాలని ఆకాంక్షించారు. గత ఏడాది ప్రజా సమస్యల పరిష్కారంలో బీఆర్ఎస్ సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ పార్టీ కార్యకర్తలు, ప్రజలందరూ కొత్త ఏడాదిలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.






