TG ఉద్యమకారుల గుర్తింపుపై ఎల్లుండి అఖిలపక్షం సమావేశం.. పార్టీలకు ఆహ్వానం

by Prasad Jukanti |

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, గౌరవించేందుకు కేకే నేతృత్వంలోని కమిటీ ఈ నెల 4న సచివాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.

TG ఉద్యమకారుల గుర్తింపుపై ఎల్లుండి అఖిలపక్షం సమావేశం.. పార్టీలకు ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారిని సముచిత రీతిలో గౌరవించేందుకు కెకె నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ అన్ని పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతోంది. నెల 4వ తేదీన ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో నిర్వహించబోయే ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలకు ప్రభుత్వ ఆహ్వానించింది. ఈ సమావేశానికి హాజరై తమ విలువైన సలహాలు, అభిప్రాయాలు తెలిపేందుకు ఒక్కో పార్టీ నుండి ఇద్దరు ప్రతినిధులను నామినేట్ చేయాలని ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలను కోరింది.

Next Story