- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ ‘మోడీ’మయం.. బీజేపీ స్పెషల్ మ్యాప్ రిలీజ్
పశ్చిమ బెంగాల్ ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. ఈ విజయంతో దేశమంతా 'మోడీమయం' అంటూ బీజేపీ విడుదల చేసిన స్పెషల్ మ్యాప్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశ రాజకీయ పటంలో కాషాయం మరింత విస్తరిస్తోంది. పశ్చిమబెంగాల్‍లో అధికారంలోకి రావాలన్న బీజేపీ చిరకాల కోరిక ఇన్నాళ్లకు నెరవేరే దిశగా ఫలితాల్లో కమలం పార్టీ జోరు కనబరుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి బెంగాల్ గడ్డపై అఖండ విజయం నమోదు చేసుకోబోతోంది. ఇటువంటి తరుణంలో ఆ పార్టీ తమ ‘ఎక్స్’ ఖాతాలో ప్రత్యేక పోస్ట్ చేసింది. కాషాయం బెంగాల్ (West Bengal)ను చేరిందని, ఇక భారత్ అంతా ‘మోడీమయం’ అని రాసుకొచ్చింది. ఈ సందర్భంగా బీజేపీ (BJP), దాని మిత్రపక్షాలు అధికారం కలిగిన రాష్ట్రాలతో కూడిన ప్రత్యేక భారత మ్యాప్‌ను పంచుకుంది. 'ఢిల్లీ నుంచి బెంగాల్ వరకు ఇది కేవలం విస్తరణ మాత్రమే కాదు. ప్రగతిపథంలో సాగేందుకు దేశ ప్రజలు మాపై చూపించిన విశ్వాసానికి ప్రతీక. నార్త్ టు నార్త్ ఈస్ట్ వరకు మార్పు కొనసాగుతోంది. ఈ ప్రయాణంలో పశ్చిమ బెంగాల్ అనే అతిపెద్ద అధ్యాయం చేరింది. మనమంతా కలిసి 2047 లోగా వికసిత్ భారత్‍ను నిర్మిద్దాం అని పిలుపునిచ్చింది.
ఆ 9 మినహా దేశమంతా కాషాయమే:
ప్రస్తుతం దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ మరియు దాని మిత్రపక్షాలు (NDA) అధికారంలో ఉన్నాయి. ఈ విషయాన్ని బీజేపీ తన ఎక్స్ ఖాతాలో చూపించింది. ఈ మ్యాప్ ప్రకారం తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఝార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, మిజోరంలో మినహా మిగతా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్డీయే కూటమినే అధికారంలో కొనసాగుతున్న విషయాన్ని స్పష్టం చేసింది.






