సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్స్.. రాజకీయ మార్పులపై స్పష్టత

by Ramesh Naini |

జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (AIFB) కౌన్సిలర్లు శనివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్స్.. రాజకీయ మార్పులపై స్పష్టత
X

దిశ, డైనమిక్ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (AIFB) కౌన్సిలర్లు శనివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వడ్డేపల్లి శ్రీనివాస్‌ నేతృత్వంలో మొత్తం ఎనిమిది మంది కౌన్సిలర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై వారు ముఖ్యమంత్రితో చర్చించారు.

రాజకీయ మార్పులపై స్పష్టత..

ముఖ్యమంత్రితో భేటీ అనంతరం కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడుతూ.. తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాము పార్టీ మారట్లేదని, కేవలం తమ మున్సిపాలిటీ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి సహకారం కోరడానికే ముఖ్యమంత్రిని కలిసినట్లు స్పష్టం చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని, నిధుల విషయంలో సానుకూలంగా స్పందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, వడ్డేపల్లి మున్సిపాలిటీని తాజాగా జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

Next Story