- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Adluri Laxman: అన్ని కార్పొరేట్ స్కూల్స్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం అమలు చేయాల్సిందే: అడ్లూరి లక్ష్మణ్
గురుకుల హాస్టల్స్ పెడింగ్ మెస్ చార్జీలు క్లియర్ చేశాం అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గురుకుల హాస్టల్ మెస్ కాంట్రాక్టర్లకు ఏప్రిల్ వరకు ఉన్న పెండింగ్ బిల్లులన్నింటినీ క్లియర్ చేశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman) చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ ప్రభుత్వం బకాయిలన్నింటిని చెల్లించిందన్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గురుకులాల అధికారులతో రివ్యూ సమావేశం అనంతరం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. రాష్ట్రంలో ఉన్న రెంట్ బిల్డింగ్స్ లో నడుస్తున్న గురుకుల పాఠశాలలు, హాస్టల్స్ కు సంబంధించిన బకాయిలును త్వరలోనే చెల్లిస్తామన్నారు. యూనిఫాం, షూస్, బుక్స్ కోసం త్వరలోనే టెండర్లు పిలిచి విద్యార్థులకు అందజేస్తామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంటిగ్రేడెట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకువస్తున్నామన్నారు. గత పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వం చేయడం లేదన్నారు. తమ దృష్టికి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ స్కూల్స్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం (Best Available School Scheme) కింద 25 శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేటాయించాల్సిందేనన్నారు. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ మాత్రమే ఈ సీట్లు ఇస్తున్నాయని మిగతా వాటిలో ఇవ్వడం లేదన్నారు.






