- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG NEWS: గ్రామీణ ప్రాంత ప్రజలకు అలర్ట్.. సీఎం ఆదేశాలతో మారిన టోల్ ఫ్రీ నంబర్
ఇకపై గ్రామీణ తాగునీటి సమస్య ఫిర్యాదుల కోసం నాలుగు అంకెల టోల్ ఫ్రీ నంబర్ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని మిషన్ భగీరథ (Mission Bhagiratha) నీటి సరఫరాలో సమస్యల పరిష్కారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన టోల్ ఫ్రీ నంబర్ (Toll Free Number) లో మార్పులు చేసింది. మిషన్ భగీరథ విభాగం గ్రామీణ ప్రజల తాగునీటి సమస్య ఫిర్యాదులను నమోదు చేసుకొవడానికి ప్రస్తుతం ఉన్న 1800-599-4007 (11-అంకెల) టోల్ ఫ్రీ నంబర్ కు బదులుగా నాలుగు అంకెల 1916 (4-అంకెల) నంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy), మంత్రి సీతక్క (Seethakka) ఆదేశాల మేరకు అధికారులు ఈ మార్పులు చేశారు. ప్రజలకు సులువుగా గుర్తుండేలా ఈ నూతన నంబర్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నాలుగు అంకెల 1916 టోల్ ఫ్రీ నంబర్ తో ప్రజలు రాష్ట్రంలో ఎక్కడి నుండైనా తమ తాగునీటి సమస్య ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి మంచి నీటిసరఫరా విషయంలో ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రభుత్వం 11 నంబర్లతో కూడిన టోల్ ఫ్రీ నంబర్ ను గతేడాది అందుబాటులోకి తీసువచ్చింది. దీనికి సంబంధించిన కాల్ సెంటర్ ను హైదరాబాద్ మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్ లో ఏర్పాటు చేసి 24/7 పని చేసేలా చర్యలు తీసుకుంది. అప్పటి నుంచి టోల్ ఫ్రీ ద్వారా వచ్చే ఫిర్యాదులను మిషన్ భగీరథ సిబ్బంది పరిష్కరిస్తున్నారు.






