- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TGPSC:గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. టీజీపీఎస్సీ కీలక విజ్ఞప్తి
రాష్ట్రం(Telangana)లో 563 గ్రూప్-1 పోస్టులకు(Group-1) నిర్వహించిన మెయిన్స్(Group-1 Mains) పరీక్షల ఫలితాల విడుదలపై అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Telangana)లో 563 గ్రూప్-1 పోస్టులకు(Group-1) నిర్వహించిన మెయిన్స్(Group-1 Mains) పరీక్షల ఫలితాల విడుదలపై అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో గ్రూప్-1 ఉద్యోగాలపై తప్పుడు వార్తలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) తీవ్రంగా ఖండించింది. ఈ ఉద్యోగ నియామక ప్రక్రియ పై సామాజిక మాధ్యమాల్లో(Social Media) జరుగుతున్న అసత్య ప్రచారం పై పోలీసులకు టీజీపీఎస్సీ(TGPSC) ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే గ్రూప్-1 ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. మార్కుల జాబితాను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లోhttps://www.tspsc.gov.in/ పెడతామని పేర్కొంది. గ్రూప్–1 అభ్యర్థుల లాగిన్‌లో పేపర్ల వారీగా మార్కులు ఉంచుతామని వెల్లడించింది. గ్రూప్-1 నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఎలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకున్నామని.. అభ్యర్థులు సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు అని విజ్ఞప్తి చేసింది.






