ఆనకట్టలపై అలర్ట్..! మెయింటెనెన్స్‌పై CMకు కేంద్ర మంత్రి లేఖ

by Kema Shiva Kumar |

రాష్ట్రంలోని ఆనకట్టల భద్రతపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఆనకట్టలపై అలర్ట్..! మెయింటెనెన్స్‌పై CMకు కేంద్ర మంత్రి లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఆనకట్టల భద్రతపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 173 ఆనకట్టలపై దృష్టి సారించాలని ఇటీవల కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. నోటిఫై చేసిన వాటిని 15 నెలల్లోగా సీడీఎస్ఈ పూర్తిచేయాలని సూచించారు. అవసరమైతే ఎన్‌డీఎస్ఏ సహాయం తీసుకోవాలని అందులో సూచించారు. రాష్ట్రంలో డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 నిబంధనల ప్రకారం, రాష్ట్ర నీటిపారుదల, కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ విభాగం పరిధిలోకి వచ్చే నిర్దేశిత డ్యామ్‌ల జాబితాను విడుదల చేసింది. వాటికి సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఐదేళ్లలోపు ప్రతి డ్యామ్‌కు మొదటి సీడీఎస్ఈ పూర్తి చేయాలనే నిబంధన ఉన్నదని, తెలంగాణలోని అన్ని డ్యామ్‌లకు మొదటి సీడీఎస్ఈ డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాల్సి ఉందని గుర్తుచేశారు. దాంతో ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో సీఎం ఇటీవల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు

మరోవైపు.. ఇదే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కీ లక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌లపై స్టేటస్ రిపోర్ట్ తయారు చేయాలని సూచించారు. ప్రాజెక్టుల వారీగా పూర్తిస్థాయి నివేదికల ఆధారంగా తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై నవంబర్ రెండో వారంలో మరోసారి సమీక్ష స మావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈఎన్సీ జనరల్, ఈఎన్సీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ నేతృత్వంలో నివేదికలు తయారవుతున్నట్లు తెలిసిం ది. కేంద్రం సూచించిన విధంగా నివేదికలు త్వరగా తయారుచేసి.. బ్యారేజీల ఆనకట్టలపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సిద్ధమైంది.

కేంద్రం నిర్దేశించిన డ్యామ్‌లు ఇవే..

తెలంగాణలో డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం నిర్దేశిత డ్యామ్ లను కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ సూచించారు. వాటిలో అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అన్నపూర్ణ, చనాక-కొరటా బ్యారేజీ, చెన్నూరు, ధర్మసాగర్ రిజర్వాయర్లు, డిండి ప్రా జెక్ట్, గండిరామారం, గోరవెల్లి, గండిపాలెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, లక్ష్మి (మేడిగడ్డ బ్యారేజీ), లక్ష్మిసాగర్ ప్రాజెక్ట్, లో యర్ మానేరు, మిడ్ మానేర్ ప్రాజెక్ట్, పోచారం, రామప్ప సరస్సు, సదర్మత్ బ్యారేజీ, సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్, శంకర సము ద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సరళసాగర్, సరస్వతి (అన్నారం) బ్యారేజీ, సర్పాన్‌పల్లి ప్రాజెక్ట్, శనిగరం, సింగసముద్రం ట్యాంక్, ఎల్లారెడ్డిపేట, లక్నవరం ట్యాంక్‌లు ఉన్నాయి. అలాగే.. ఓనర్ల పరిధిలో ఉన్న డ్యాముల జాబితాను సైతం వెల్ల డించారు. వాటిలో హిమాయత్‌సాగర్, కిన్నెరసాని ప్రాజెక్ట్, మంజీరా, ఉస్మాన్ సాగర్ ఉన్నారు. ఈ జాబితాలోని డ్యా మ్ లు, రిజర్వాయర్లు వాటి భద్రత, పర్యవేక్షణ కోసం ప్రత్యేక మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర మంత్రి సూచించారు.

Next Story